హైదరాబాద్‌ మోకిలాలో ఒక్కోటి రూ.2 కోట్లకు పైగా ఖరీదైన 212 విల్లాల్లోకి చేరిన వరద నీరు (వీడియో)

76చూసినవారు
హైదరాబాద్‌లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగర శివారు ప్రాంతమైన మోకిలాలో ఉన్న 'లా పాలొమా' వెంచర్‌లో మోకాళ్ల లోతు నీరు చేరింది. స్థానికులు తెలిపిన ప్రకారం, ఈ వెంచర్‌లో ఒక్కోటి రూ.2 కోట్లకు పైగా విలువ ఉన్న 212 విల్లాలు ఉన్నాయి. అయితే విల్లాలకు వెళ్లే దారులలో వరద ప్రవహిస్తుండగా, విల్లాల్లోనూ నీరు చేరినట్లు వీడియోలో కనిపించింది. పైనుంచి వరద వస్తుండటంతో మోటర్లతో నీటిని తోడినా ప్రయోజనం లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్