హిమాచల్ ప్రదేశ్ అనగానే మనకు ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం, నదుల పరవళ్లు, కొండలు, హిమాలయ పర్వతాలు గుర్తొస్తాయి. అయితే, గత నెలలో వరదలు ముంచెత్తినప్పటికీ కిన్నౌర్ జిల్లాలోని బాస్పా లోయలో ఉన్న సాంగ్లా అనే ప్రాంతం ఎంతో రమణీయంగా కనిపిస్తోంది. ఓ వైపు కాలువలు, మరోవైపు కొండలపై పింక్ కలర్ పుష్పాలను చూపే వీడియో ఆకట్టుకుంటోంది. ఏటా సెప్టెంబర్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.