త్వరలోనే FM ఛానెల్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని ‘హైడ్రా' కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. దాని ద్వారా హైడ్రా తరఫు నుంచి ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు వీలుంటుందని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయన్నారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు.