కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని హరనహళ్లికి చెందిన ధనుశ్రీ(20) బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఎక్కువ సేపు మొబైల్‌తోనే ఉంటుంది. ఫోన్ వాడకాన్ని తగ్గించమని తల్లి మందలించింది. దీంతో ధనుశ్రీ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.