పండుగల్లో మహాశివరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. పగలంతా ఉపవాసం ఉండి శివయ్యను ధ్యానిస్తూ, రాత్రి నిద్ర పోకుండా లింగమూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజును ఉపవాసం, రాత్రి జాగరణ, శివనామ స్మరణ ఈ మూడూ ముఖ్యమైనవి. ఈ మూడూ పాటిస్తూ శివయ్యను పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.