వరి నాట్లలో ఈ జాగ్రత్తలు పాటించండి

63చూసినవారు
వరి నాట్లలో ఈ జాగ్రత్తలు పాటించండి
వరి నాట్లు వేసే రైతులు దిగువ సూచించిన జాగ్రత్తలు పాటించాలి.
* నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ముచేసి చదును చేయాలి.
* నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేయాలి.
* 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (విత్తనం చల్లేముందు 1 కిలో, మరో కిలో విత్తిన 10-15 రోజులకు), 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి.
* మండె కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో సమానంగా పలుచటి నీటి పొర ఉంచి విత్తుకోవాలి. మరుసటి రోజు నారు మడిలో నీటిని మొత్తం తీసివేయాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్