గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచిన తర్వాతే కొన్నిచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క అనుమానం వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్‌ను కోరుతున్నామని చెప్పారు. గురువారం ఓ గురుకులంలో కిచెన్ వెనుక గదిలో ఉన్న ఎలుకల ఫోటోను తీసి అన్నంలో పడ్డట్లుగా ప్రచారం చేశారని అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ కొత్తగూడ మండల కేంద్రంలో మాట్లాడారు.