నామినేషన్ దాఖలుతోపాటు ఫారం-26 తప్పనిసరి

84చూసినవారు
నామినేషన్ దాఖలుతోపాటు ఫారం-26 తప్పనిసరి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీలోపు ఇవ్వొచ్చు. ఫారం –26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్