ఏపీ సీఎం పెట్టుబడలే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్స సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశమై మాట్లాడుతూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్పందించారు. ఎక్కడికెళ్లానా చంద్రబాబు సొంత డబ్బా మానలేదంటూ ఎద్దేవా చేశారు. దావోస్‌లో రాష్ట్ర పరువు తీస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంపై ఇంకా బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.