ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్‌ బైరూ

56చూసినవారు
ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్‌ బైరూ
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇ మ్మానుయేల్‌ మాక్రాన్ డిసెంబ‌ర్ 13న అధికార కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్‌ బైరూ పేరు(73)ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. 2024లో ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రి మారడం ఇది మూడోసారి. బైరూ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ వ్యవస్థాపకుడు. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార కూటమిలో 2017 సంవత్సరం నుంచి ఈ పార్టీ మిత్రపక్షంగా ఉంది. గతంలో ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి మూడుసార్లు ఫ్రాంకోయిస్ పోటీ చేశారు.

సంబంధిత పోస్ట్