AP: సీఎం చంద్రబాబు మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా, BC, EWS మరియు కాపు వర్గాలకు చెందిన 1.02 లక్షల మంది మహిళలకు 90 రోజుల పాటు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి.. ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన రూ.224.15 కోట్ల చెక్కును సీఎం రిలీజ్ చేశారు. MEPMA ద్వారా డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల కోసం రూ.645.52 కోట్ల చెక్కును కూడా చంద్రబాబు విడుదల చేశారు.