నాని నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకముందే 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. కాగా, ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.