అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ బ్రాహ్మణి నా క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లిస్తుంది. ఆమె నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను నేర్చుకోవాలి. ఆమె కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటూ కుమారుడు దేవాన్ష్‌తో పాటు నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆమె కోసం ప్రతి రోజూ ఉమెన్స్ డే నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.