ఇకపై మైనర్లు బండి నడిపితే యజమానులదే బాధ్యత

72చూసినవారు
ఇకపై మైనర్లు బండి నడిపితే యజమానులదే బాధ్యత
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మైనర్ల చేత వాహనాలు నడిపించడం నివారించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే, వాహన యజమానులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలలో వాహనాల రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేయనున్నట్టు పేర్కొన్నారు. సురక్షిత రవాణా కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్