కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు విడుదల

83చూసినవారు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు విడుదల
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.725 కోట్లను మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్ లో కేటాయించిన ఆయా నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల కింద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. తులం బంగారం అందించడంపై ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దీని అమలుపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్