తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వంట పాత్రల కొనుగోలుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్‌కి రూ.10వేల నుంచి రూ.25 వేలు కేటాయించింది. మొత్తంగా రూ.23.76 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం 23 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకునేందుకు డీఈవోలకు అనుమతినిచ్చింది.