మధ్యప్రదేశ్ మండ్సర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లలితాబాయి అనే యువతి 18 నెలల క్రితం తప్పిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ద్వారా గుర్తుతెలియని శవం లభ్యమవడంతో, ఆనవాళ్ల ప్రకారం, తమ కూతురే చనిపోయిందనుకుని, మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే, లలితాబాయి తాజాగా ఇళ్లు చేరింది. ఓ వ్యక్తి తనను కిడ్నాప్ చేసి, జైళ్లో పెట్టించాడని తెలిపింది.