డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సమ్మతం కాదని అన్నారు. కేంద్రం బిగ్ బ్రదర్లా ఉండాలి కానీ.. బిగ్ బాస్లా కాదుని కేటీఆర్ హితవు పలికారు.