ఏఐ టెక్నాలజీ అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాలల్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ క్రియేట్ చేసిన ప్రధాని మోడీ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత సంప్రదాయంలో గ్రాండ్‌గా రూపొందించిన ఈ వేడుకలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి డ్యాన్స్ చేయటం, తదితర రాజకీయ నాయకులు సందడి చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. చివరలో ప్రధాని మోడీ కూడా స్టెప్పులేసినట్లు రూపొందించారు.