తాను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని, కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మీడియా, సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని, జాతీయ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని క్రమశిక్షణతో అమలు చేయడమే కార్యకర్తల బాధ్యత అని చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పోరాటాలు చేశానని చెప్పారు.