డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. చెన్నైలో డీలిమిటేషన్‌పై కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. "దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది." అని కేటీఆర్ పేర్కొన్నారు.