నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం, బల్మూర్ అంగన్వాడి సెక్టార్ కి చెందిన అంగన్వాడీ హెల్పర్ నిర్మల ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలో ఉత్తమ హెల్పర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్మలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు.