నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని మన్ననూర్ నల్లమల అటవీ ప్రాంతంలో చారిత్రక అటవీ ప్రదేశాల్లో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరుపుతున్నారని వీటి పైన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించాలని ఆదివారం బిజెపి నేత నాగరాజు డిమాండ్ చేశారు. అటవీశాఖ తనిఖీ కేంద్రానికి దగ్గరలో తవ్వకాలు జరపటం, నిత్యం రద్దీ ఉండే ప్రదేశంలో తవ్వకాలు చేయటం అనేక అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు.