జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన బీచుపల్లి (23) తన స్విఫ్ట్ కారులో రాజోలికి చెందిన తన అత్త, మామలతో (కేశన్న, సంజమ్మ) నాటు వైద్యం కొరకు పాణ్యం సమీపంలోని ఉమాపతి నగర్ కు వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో రాజోలి గ్రామానికి చెందిన భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. బీచుపల్లికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించారు.