ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని మర్యాదపూర్వకంగా కలిసి, ఈనెల 29న గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే ప్రైవేట్ సంస్థల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నంద, బాబయ్య నాయుడు, మురళీధర్ రెడ్డి, వైన భాష, రమేష్, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.