దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామ ఊక చెట్టు వాగుపై ప్రభుత్వం వేసిన ఇసుక రీచ్ టెండర్లను రద్దు చేసుకోవాలని గ్రామ రైతులు గురువారం మండలం తహశీల్దార్ ఎల్లయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఊక చెట్టు వాగు నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలింపు గతంలో ఎప్పుడు జరగలేదని, భారీగా ఇసుక తరలింపు చేపడితే వాగు పరివాహక రైతులకు సాగు, తాగునీటి కష్టాలు తప్పవని అన్నారు.