మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లాల్ కోటలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పుల విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ నెలకు రూ. 6000 వేల కోట్ల మిత్తి కట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.