దేవరకద్ర: రైతు పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే జియంఆర్

85చూసినవారు
దేవరకద్ర: రైతు పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే జియంఆర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ వద్ద గురువారం నిర్వహిస్తున్న రైతు పండుగ, రైతు అవగాహన సదస్సులో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులను సాదరంగా ఆహ్వానించి స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ రంగ మేధావులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్