దేవరకద్ర నియోజకవర్గం డోకూర్ కు చెందిన రైతు మొగిలన్న వరిపంటకు సమయానికి కోయిల్ సాగర్ నీళ్లు వదలక తన 3ఎకరాల పంట ఎండిపోయిందని గురువారం బోరుమన్నాడు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మొగిలన్నను ఫోన్ లో పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడిగిన వెంటనే నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 20ఫీట్ల నీళ్లు ఉన్నా కూడా నీళ్లు వదలక తన పంట ఎండిపోయిందన్నారు. రూ. 3 లక్షల అప్పులు చేశానని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.