రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజాభవన్ ముట్టడికి వెళుతున్న దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల బీఆర్ఎస్ నాయకులను అడ్డాకుల పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అడ్డాకుల మండల సింగిల్ విండో అధ్యక్షులు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమన్నారు.