38 రోజుల తర్వాత 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ హర్షనీయమన్నారు. ఇది లగచర్ల రైతుల విజయం అని రేవంత్ సర్కార్ కు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందని, పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లలో ఎంపి అరుణ పర్యటించి బాధితులను కలుస్తానన్నారు. ఇకనైనా రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు.