గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. శాసనమండలిలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చూస్తున్నామని అన్నారు. క్వాలిటీ ఫుడ్ ను విద్యార్థులకు అందించాలని కోరారు.