నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జలసౌధలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన పెండింగ్ పనులను, కొత్తగా చేపట్టబోయే పనులను గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తామని అన్నారు.