దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత వారం రోజులపాటు ఉక్కబోత వేసవి కాలాన్ని తలపించింది. కానీ అనుకోకుండా సోమవారం మధ్యాహ్నం వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా వర్షాలు కురియకపోవటంతో వరినాట్లు వెనుకబడ్డాయి.