అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహిస్తామని, గ్రామసభలలో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామని వివరించారు. గ్రామపంచాయతీలకు పంపిన తుది జాబితా కాదని, పేర్లు రానివారు ఎవరు ఆందోళన చెందొద్దని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే తెలిపారు.