ఏపీ సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుని విమానాశ్రయం నుంచి నేరుగా 1 జన్‌పథ్‌లోని నివాసానికి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ తరువాత విజయవాడ బయలుదేరనున్నారు.