చమురు ధరలు దిగివస్తే ఉక్రెయిన్‌పై యుద్ధం ముగుస్తుంది: ట్రంప్‌

62చూసినవారు
చమురు ధరలు దిగివస్తే ఉక్రెయిన్‌పై యుద్ధం ముగుస్తుంది: ట్రంప్‌
గతంలో కంటే అమెరికా మరింత బలంగా, సంపన్నంగా మారుతుందని ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌ హౌస్‌ నుంచి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు."ముడి చమురు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా, ఒపెక్‌ దేశాలను అభ్యర్థిస్తున్నా. చమురు ధరలు దిగివస్తే.. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వెంటనే ఆగిపోతుంది. ఇతర ప్రభుత్వాలు 4 ఏళ్లలో చేయలేని పనులను మేం నాలుగు రోజుల్లో చేసి చూపించాం." అని ట్రంప్ అన్నారు.

సంబంధిత పోస్ట్