బెల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషకాలను జీర్ణం చేయడంలో చిన్న ప్రేగులకు ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త ప్రసరణను సడలించడం, రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రక్తహీనతను నివారించడంలో, చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అలాగే అల్లంతో బెల్లం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.