దావోస్ బెల్వేడేర్‌లో హెచ్‌సీఎల్ సీఈఓ కళ్యాణ్ కుమార్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో మరో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా హెచ్‌సీఎల్‌ను విస్తరించాలని కోరారు. త్వరలో హెచ్‌సీఎల్ విస్తరణ కార్యకలాపాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని సీఈఓ కళ్యాణ్ కుమార్ అన్నారు.