రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం వాటా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం అమరచింత పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లకు కేంద్రం ప్రధాని ఆవాస్ పథకం కింద సగం డబ్బు ఇస్తుందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇళ్లు ఇస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని సూచించారు.