జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిషేధిత గంజా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేస్తున్న గొంగళ్ళ రంజిత్ కుమార్‌కు సోమవారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జోగులాంబ గద్వాల అధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి పనులు సమాజానికి హానికరమని దీన్ని తక్షణం నివారించాల్సిన అవసరం ఉందన్నారు.