పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ శ్రీ జీ. చిన్న దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ వినాయక చవితికి మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలని పిలుపునిచ్చారు.