పారిశుద్ధ్య మహిళా కార్మికురాలికి గాయాలు

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య మహిళా కార్మికురాలికి గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట రోజువారి విధి నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్న కార్మికురాలు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది. ఈ క్రమంలో ఆమె పక్కటెముక విరిగి ఏమాత్రం నడవలేని స్థితికి చేరుకుంది. వెంటనే సహచర కార్మికులు ఆమెను వైద్యుడి వద్దకు తరలించారు.

సంబంధిత పోస్ట్