కేంద్రం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి: ఏఐటియుసి

53చూసినవారు
కేంద్రం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి: ఏఐటియుసి
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని బుధవారం ఏఐటియుసి మహబూబ్ నగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ డిమాండ్ చేశారు. ఆగస్టు 3,4న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే కార్మిక చైతన్య సదస్సుకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్