పోలీసు భద్రత మధ్య గణనాథుల నిమజ్జనం

57చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ పెద్ద చెరువులో పోలీసు భద్రత మధ్య వినాయకుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు సోమవారం ఒకటోకటిగా చెరువులో నిమజ్జనం అవుతున్నారు. శ్రీనివాసకాలనీ, యోగి టిఫిన్ సెంటర్ నుండి పాలకొండ చెరువు వరకు ఇది వరకే మున్సిపల్ అధికారులు రోడ్లకు తాత్కాలిక మరమ్మతు చేయించారు. చెరువు వద్ద కూడా పోలీసుల సూచనల మేరకు నిమజ్జనం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్