జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండ కొట్టిన రాత్రి అయ్యేసరికి భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వర్షం వేరుశనగ పంట సాగు చేయడానికి అనుకూలంగా మారిందన్నారు. జొన్న, మొక్కజొన్న పంటకు కూడా వర్షంతో మేలు చేకూరుస్తుందని రైతులన్నారు.