మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ డీకే అరుణ ఇంటిని శనివారం నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ , ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, స్టూడెంట్ లీడర్ల మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల లీడర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.