మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి నారమ్మ(32) ఆసుపత్రి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం, కందన్ పల్లికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ మేనల్లుడు నరేష్ తో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యింది. బాత్రూమ్ అని చెప్పి వెళ్ళి ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుంది.