నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామ సమీపంలో రాత్రి 9: 30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న సుద్దకల్ గ్రామానికి చెందిన వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బొలెరో టి ఎస్.31. టి ఏ 2619 వాహనం బైక్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.