ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తలకొండపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శనివారం పర్యటించారు. మండలంలోని పడకల్ గేటు వద్ద నూతనంగా నిర్వహించిన ఆర్చిని ఆయన ప్రారంభించారు. మంత్రి జూపల్లికి గ్రామస్తులు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపులో మంత్రి, ఎమ్మెల్యే, ఠాగూర్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.